calender_icon.png 31 March, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలి

28-03-2025 05:42:12 PM

మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గుండ్ల చెరువులో చేస్తున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం మాజీ జేడ్పీటీసీ పరిశీలించారు. జాబ్ కార్డు ఉన్న అందరూ ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూలీలకు నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని మాజీ జేడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు సంబంధిత అధికారులకు సూచించారు. కూలీలకు నీటి సదుపాయంతో పాటు నీడ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని  ఏపీవో రజినీతో ఫోన్లో మాట్లాడారు. ఉపాధి కూలీలు నీటి సౌకర్యం లేదని తమ దృష్టికి తీసుకురావడంతో,గుండ్ల చెరువు వద్ద పనులు చేస్తున్న స్థలానికి వెళ్లి పరిశీలించానని ఆయన తెలిపారు. శనివారం నుంచి నీటి సౌకర్యం నీడ సౌకర్యం కల్పిస్తామని అధికారులు తెలిపినట్లు వారు పేర్కొన్నారు.