calender_icon.png 20 April, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కుమార్తె వివాహం

20-04-2025 08:23:07 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ శోభ రాజు కుమార్తె కీర్తన, రీత్వాన్ ల వివాహం ఆదివారం నాడు కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ లోకన్నుల పండువగా వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ శాసనసభాధిపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్, కామారెడ్డి శాసనసభ్యులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ శాసనసభ్యులు హనుమాన్ సిండే, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి, జాజాల సురేందర్, తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చివరి జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగిన దఫేదార్ రాజు, కామారెడ్డి జిల్లా మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన దఫేదార్ శోభల కుమార్తె వివాహానికి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు అనుచరులు భారీగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.