calender_icon.png 4 April, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీ సాహితీని సన్మానించిన ఐదో వార్డు మాజీ కౌన్సిలర్ మాదినేని సునీత ప్రసాద్..

03-04-2025 11:22:57 PM

వైరా (విజయక్రాంతి): ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ లో 129 ర్యాంకు మల్టీ జోన్ 1 లో 69 ర్యాంకు సాధించిన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన సంగేపు వెంకటేశ్వర్లు కవితా దంపతుల కుమార్తే సంగేపు లక్ష్మీసాహితిని ఐదో వార్డు మాజీ కౌన్సిలర్ మాదినేని సునీత ప్రసాద్ లు గురువారం ఆమె ఇంటికి వెళ్లి అభినందించారు. శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. కృషి అంకిత భావం పట్టుదలతో ర్యాంకు సాధించటం పట్ల లక్ష్మీ సాహితీని అభినందించారు. పట్టుదలతో ఎలాంటి కోచింగ్ సెంటర్ కు వెళ్లకుండా చదువుకుంటూ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ టెస్ట్ సిరీస్ లను రాసి ముందుకు సాగి సాధించటం గొప్ప విషయమని ఆమె అన్నారు.

గ్రూప్ వన్ ఫలితాల్లో వైరా పట్టణం పేరును చిరస్థాయిలో నిలిపారని సామాన్య మధ్యతరగతి, కుటుంబం నుంచి చదివి ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడం బలహీన వర్గాలకు చెందిన సంగేపు లక్ష్మీసాహితి అభినందనీయమని ఆమె అన్నారు. మరెన్నో ఉన్నత శిఖరాల అవరోధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మి సాహితీ మాట్లాడుతూ... భవిష్యత్తులో ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం గ్రూపులో ర్యాంకు సాధించానని ఐఏఎస్ లక్ష్యంగా ముందుకు సాగుతానని సాహితి తెలిపింది. ఈ కార్యక్రమంలో మాదినేని దుర్గాప్రసాద్ నల్లమోతు లక్ష్మీనారాయణ రంగా సత్యనారాయణ ఏడు నూతల బుచ్చి రామారావు మాదినేని లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.