24-03-2025 03:07:12 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం ఏర్పాటు చేసి గతంలో వీఆర్వోలుగా పని చేసిన వారిని వీఆర్ఏలను జీవో నెం.41 ద్వారా తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవడంతో ఉద్యోగులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో గతంలో విఆర్వోలుగా, వీఆర్ఏగా పనిచేసిన ఉద్యోగులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం... మళ్ళీ మమల్ని రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం పట్ల ఆనందంగా ఉన్నదన్నారు. గత ప్రభుత్వం అర్థ రాత్రి..ఎప్పుడు కానీ విని ఎరురుగని రితినా ల్యాటరి పద్దతి ద్వారా చెట్టుకు ఒకోలాని పుట్టకు ఒకరిని చేసిందన్నారు. ప్రభుత్వం పాలన అభివృధి సంక్షమా పతకాలను విజయవంతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం లో అందరికి న్యాయం, సంక్షేమ పథకాలు అందించాలనే ఉదేశ్యం తో, తిరిగి గ్రామపాలను ప్రతిష్ట చేసేందుకు తమను తీసుకుందన్నారు. ప్రభుత్వం తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకోవడంతో ఉద్యోగులు స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్ష ఎస్ .సంజీవ్ రావు. కార్యదర్శి. రజినీకాంత్, పూర్వ వీఆర్వో లు మొయిన్, శ్రీనివాస్, ఆఫ్జల్, పెంటన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.