19-03-2025 11:09:00 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి - కొత్తగూడెం హైవే రహదారిలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో టేకులపల్లి మండల పరిషత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఉండేటి ప్రసాద్ మృతి చెందారు. ప్రసాద్ తన సొంత గ్రామమైన సులానగర్ నుంచి కొత్తగూడెంకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఎదురుగ వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడు వేగంగా వచ్చి సీతారాంపురం సమీపంలో ఢీ కొట్టాడు. రోడ్డుపై పడిపోయిన ప్రసాద్ కు తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ద్విచక్ర వాహనదారుడి వివరాలు తెలియాల్సి ఉండగా అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.