అబ్దుల్లాపూర్ మెట్,(విజయక్రాంతి): మాజీ వైస్ ఎంపీపీ పరామర్శించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పరామర్శించారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల మాజీ వైస్ ఎంపీపీ కొలను శ్రీధర్ రెడ్డి గత నాలుగు రోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే... కుటుంబ సభ్యులు యశోద హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సోమవారం యశోద హాస్పిటల్ కి వెళ్లి మాజీ వైస్ ఎంపీపీ కొలను శ్రీధర్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం శ్రీధర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... శ్రీధర్ రెడ్డి కి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కర్ చారి, మాజీ సర్పంచ్ లు చిత్తరి, శ్రీనివాస్ రెడ్డీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండల్ రెడ్డి, కళ్లెం లింగ రెడ్డి, రాము యాదవ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.