calender_icon.png 10 January, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు

14-07-2024 11:13:59 AM

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ చెవికి గాయం కాగా ఆస్పత్రికి తరలించారు. పెన్సిల్వేనియాలో బట్లర్ లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ట్రంప్ పై దుండగులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తక్షణమే ట్రంప్ ను వేదికపై నుంచి తరలించారు. దుండగుడి కాల్పలుల్లో ట్రంప్ ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మృతిచెందాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా సిబ్బంది హతమార్చినట్లు సమాచారం. దాడి జరిగిన ప్రాంతాల్లో సీక్రెట్ సర్వీస్ చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలోని బిల్డింగ్ లను బలగాలు తమ ఆదీనంలోకి తీసుకున్నాయి.