* అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస
* 1977లో అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన జిమ్మి కార్టర్
* అత్యధిక కాలం బతికిన యూఎస్ అధ్యక్షుడిగా రికార్డు
* కార్టర్ పర్యటనకు గుర్తుగా భారత్‌లో గ్రామం
వాషింగ్టన్, డిసెంబర్ 30: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ (100) ఆయన స్వగృహంలో కన్నుమూశారు. అమెరికాకు 39వ అధ్యక్షుడిగా 1977 వరకు కార్టర్ సేవలందించారు. అమెరికా చరిత్రలో అత్యధిక కాలం బతికిన అధ్యక్షుడిగా ఆయన రికార్డులకెక్కారు.
కార్టర్ అనారోగ్య సమస్యలతో మరణించినట్లు ఆయన తనయుడు ధ్రువీకరించారు. 1924 అక్టోబర్ 1న జన్మించిన కార్టర్ ఇటీవలే తన 100వ పుట్టిన రోజును కూడా ఘనంగా జరుపుకున్నారు.
అత్యధిక కాలం బతికిన అధ్యక్షుడిగా రికార్డు
అమెరికా చరిత్రలో అత్యధిక కాలం బతికిన అధ్యక్షుడిగా జిమ్మి కార్టర్ రికార్డులకెక్కారు. 1924లో జన్మించిన కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా సేవలందించడమే కాకుండా రైతుగా, నేవీ ఉద్యోగిగా, గవర్నర్‌గా కూడా సేవలందించారు. కార్టర్ మంచి మనసున్న వ్యక్తి అని అనేక మంది కొనియాడుతారు.
అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన కార్టర్ 2002లో నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు. క్యాన్సర్ వ్యాధి వస్తే దాన్ని జయించి నిలబడిన యోధుడు కార్టర్. ఆయన అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు కూడా వచ్చారు. ఆయన పర్యటనకు గుర్తుగా హర్యానాలోని ఓ గ్రామానికి ‘కార్టర్‌పురి’ అని నామకరణం చేశారు.
నా తండ్రి యూనివర్సల్ హీరో..
‘నా తండ్రి నాకు మాత్రమే హీరో కాదు. శాంతిని కోరుకుంటూ మానవహక్కులను ప్రేమించే ప్రతి ఒక్కరికే హీరోనే’ అని కార్టర్ కుమారుడు ఓ ప్రకటనలో తెలిపారు. కార్టర్ తల్లి లిల్లియాన్‌కు కూడా భారత్‌తో అనుబం ధం ఉంది. ఆమె 1960 సమయంలో భారత్‌లో హెల్త్ వాలంటీర్‌గా సేవలందించారు.
అగ్రనేతల సంతాపం
కార్టర్ మృతికి అమెరికా మాజీ అధ్యక్షులు క్లింటన్, బుష్, ఒబామా, ట్రంప్ (కాబోయే అధ్యక్షుడు కూడా), ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ సంతాపం తెలిపారు. గొప్ప రాజకీయ వేత్తను కోల్పోయామని పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీ కూడా సంతాపం ప్రకటించారు. కార్టర్‌కు నలుగురు సంతానం ఉ న్నారు. జనవరి 9న అమెరికాలో జాతీయ సంతాప దినంగా పాటించాలని అధ్యక్షుడు ప్రకటించారు.
కార్టర్ పేరిట భారత్‌లో గ్రామం
జిమ్మి కార్టర్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జనవరి 3 1978లో భారత పర్యటనకు వచ్చా రు. ఆ పర్యటన సందర్భంగా కార్టర్ హర్యానాలోని ఓ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామానికి అతడు వచ్చి వెళ్లిన తర్వాత ‘కార్టర్‌పురి’గా నామకరణం చేశారు.
దౌలత్‌పూర్ నాసిరా బాద్‌గా ఉన్న గ్రామం పేరును కార్టర్ పర్యటన తర్వాత గ్రామస్తులు కార్టర్‌పురిగా మార్చారు. అప్పటి నుంచి కార్టర్‌పురిలో జనవరి 3న సెలవుదినంగా పాటిస్తున్నారు.