హాజరైన సీడబ్ల్యూసీ మెంబర్ సీ వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (విజయక్రాంతి): మాజీ కేంద్రమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ మల్లికార్జున్ 22వ వర్ధంతి సందర్భంగా బుధవారం మహబూబ్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి నాయకులు నివాళి అర్పించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ సీ వంశీచందర్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున్ కుమారుడు మనూ మల్లికార్జున్, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒబైదుల్లా సహా పలువురు నేతలు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మల్లికార్జున్ అందించిన సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఆయన రక్షణ శాఖ, రైల్వే శాఖ సహాయ మంత్రి హోదాల్లో చేసిన సేవలు, 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి నాయకుడిగా చేసిన పోరాటం, పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన కృషి, మహబూబ్‌నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు.
ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికైన డాక్టర్ మల్లికార్జున్ తన ప్రజాజీవితాన్ని 1969 తెలంగాణ ఉద్యమంతో ప్రారంభించారు. వైద్య విద్యార్థిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత పలువురు పీఎంల హయాం లో కేంద్రమంత్రిగా సేవలు అందించారు.
తెలంగాణ పోరాటానికి జీవితాంతం మద్దతుగా నిలిచిన ఆయన, కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ వ్యవస్థాపకుడిగా కీలకపాత్ర పోషించారు. 2002, డిసెంబర్ 24న కన్నుమూ శారని నాయకులు గుర్తు చేసుకున్నారు.