calender_icon.png 1 March, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుజిసి మాజీ సభ్యునికి సన్మానం

01-03-2025 05:53:18 PM

కామారెడ్డి అర్బన్, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మాజీ యుజిసి సభ్యుడు ప్రొఫెసర్ శివరాజు(Former UGC Member Professor Sivaraju) శనివారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ... కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ పీజీ కళాశాలకు న్యాక్ గుర్తింపు, అటానమస్ రావడానికి అప్పట్లో ఎంతో కృషి చేశారని, ఆయన సేవలను గుర్తు చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులతో సమన్వయం చేసుకుంటూ విద్యాభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారని కొనియాడారు. అనంతరం అధ్యాపకులు, అలుమ్ని సభ్యులతో ఆయనను ఘనంగా శాలువాతో సత్కరించి జ్ఞాపకను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా.కిష్టయ్య, డా.రాజగంబీర్, డా.సుధాకర్, అలుమ్ని సభ్యులు డా.రాహుల్ కుమార్,డా.సంతోష్ గౌడ్,డా.సత్యంలు పాల్గొన్నారు.