calender_icon.png 27 November, 2024 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్న మధ్యాహ్న భోజన పథకం

27-11-2024 03:14:55 PM

హుజురాబాద్,(విజయక్రాంతి)తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, విద్యార్థుల పాలిట మధ్యాహ్న భోజనం శాపంగా మారుతుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం వసతులపై కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్ మాట్లాడుతూ... గడిచిన వారం రోజుల నుంచి గురుకులాలలో మధ్యాహ్న భోజనం తిని చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. రెండు రోజుల క్రితం జమ్మికుంట కస్తూరిబా పాఠశాలలో 10 తరగతి చదువుతున్న నిత్యశ్రీ అనే విద్యార్థిని పాఠశాల నిర్లక్ష్యంతోనే మరణించిందని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షలు వెచ్చించి వారికి నాణ్యమైన విద్యతో పాటు భోజన సౌకర్యాన్ని కల్పించారు.

నాణ్యమైన భోజనం అందించడంలో విఫలమైన ప్రభుత్వంపై హైకోర్టు మొట్టికాయలు వేసిన మార్పు రావడంలేదని మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎక్కువ శాతం దళితులు, బీసీలు ఉంటారని ప్రభుత్వంపై నమ్మకంతో విద్యార్థులను పాఠశాలలు చేర్పిస్తే ఇలా చేయడం ఎంతవరకు సరైందని ఆయన ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం సరిగా లేదని హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్  స్వయంగా పరిశీలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలపై నివేదిక తీసుకొని వెంటనే నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలుచేపడతామని హెచ్చరించారు.ఆయనతోపాటు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొల్లిపాక శ్రీనివాస్. నాయకులు చింత శ్రీనివాస్,మోరే మధు,తోపాటు తదితరులు పాల్గొన్నారు.