calender_icon.png 6 February, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఉపసర్పంచ్ తోట రమేష్

06-02-2025 07:04:53 PM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని బి.కొండాపూర్ మాజీ ఉపసర్పంచ్ తోట రమేష్ తో పాటు మెతకుపల్లి సతీష్ రెడ్డి, రంగమ్మ గారి గోపాల్ రెడ్డి, ఖాజీపూర్ శ్రీ కొట్టాల శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తోట రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుప్రభాత రావు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు యుగంధర్ రావు జె వెంకటరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, మాజి సొసైటీ చైర్మన్ తాడెం వెంగళరావు, అమరేందర్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, అయితే పరంజ్యోతి, జూకంటి రాజు గౌడ్ సండ్రగు శ్రీకాంత్, రాజు, వెంకటేష్, రాధాకృష్ణ తదితరులున్నారు.