calender_icon.png 1 March, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాచారంలో ఘనంగా మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు జయంతి వేడుకలు

01-03-2025 08:37:01 PM

మంథని (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్‌ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు నాచారంలో ఘనంగా నిర్వహించారు. నాచారం లాయిన్స్ క్లబ్ ఎలైట్, ఎస్ఏస్ఎస్ యువసేన, మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి ఆద్వర్యంలో సాధన మానసిక దివ్యాంగుల కేంద్రంలో దివ్యాంగుల మధ్య శ్రీపాదరావు చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దివ్యాంగులకు ఆహారం, పండ్లను అందించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ... సర్పంచ్‌ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి, శాసనసభ్యుడిగా, శాసన సభాదిపతిగా పదవి చేపట్టి పదవికే వన్నె తెచ్చారని అన్నారు.

రాష్ట్రానికి ఎనలేని సేవచేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రవుగా పేరుగాంచిన శ్రీపాద రావు ఆశయ సాధనకోసం ప్రతి ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటుక కృష్ణా రెడ్డి, మామిడాల రాజారెడ్డి, కార్యకర్తలు జావీద్, నరేష్, ఎస్ఎస్ఎస్ యువసేన సబ్యులు కిషోర్ రెడ్డి, విజయ్ సింగ్, సాయి చంద్, ఆరెళ్ల శ్రీధర్, అక్షంత్ పడాల, సెబాస్టియన్‌, ఆండ్రూ, ఆకుల రాకేష్, జోషిద్ యాదవ్ తధితరులు హాజరయ్యారు.