స్వర్ణకారుడి మృతి కేసులో ఆరోపణలు
న్యూఢిల్లీ, ఆగస్టు 30: బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రిజర్వేషన్ల ఆందోళన సందర్భంగా ఓ సర్ణకారుడి మృతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్లమెంట్ మాజీ స్పీకర్ షర్మీన్‌చౌదరి, మాజీ మంత్రి మున్షిని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం శుక్రవారం అరెస్టు చేసింది. హసీనా రాజీనామా చేసింది మొదలు.. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు, అవామీ లీగ్ నేతల అరెస్టులతో బంగ్లాలో రాజకీయ అస్థిరతకు దారి తీసింది. అవామీ లీగ్‌కు చెందిన 14మంది నేతల ప్రయాణాలపై ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవల మేఘాలయలో అవా మీలీగ్‌కు చెందిన ఇషాక్ అలీఖాన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన మృతికి కారణాలు తెలియనప్పటికీ.. ఇది బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం పనే అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.