సియోల్, డిసెంబర్ 11: దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసుల సోదాలు కొనసాగుతున్న వేళ.. ఆ దేశ రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యోంగ్ హైయున్ అండర్‌వేర్‌తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విచారణ అధికారుల అదుపులో ఉన్న ఆయన జైల్లోనే ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం.
కారాగార సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దక్షిణ కొరియా అధ్యక్షుడైన యూన్ సుక్ యోల్‌కు హైయున్ అత్యంత సన్నిహితుడు. దేశంలో సైనిక పాలన విధిస్తూ ప్రకటన వెలువడటం పట్ల ఈయన ప్రమేయం ఉందనేది ప్రధాన ఆరోపణ.
దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ సమయంలోనే కస్టడీలో ఉన్న హైయున్ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు.