31-03-2025 06:42:38 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గం కోనాపూర్ గ్రామంలో రంజాన్ పండగ సందర్భంగా సోమవారం మైనారిటీ పెద్దలకు, సోదరులకు కోనాపూర్ మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ... మన దేశం సర్వమత సమ్మేళనం అని, ప్రతి పౌరుడు ఇతర మతాలను గౌరవించాలని పేర్కొన్నారు.