calender_icon.png 21 February, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ కుమారుడు మృతి

20-02-2025 10:18:45 AM

టేకులపల్లి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి టేకులపల్లి మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. టేకులపల్లి మండలం సులాన గర్ మాజీ సర్పంచ్ అజ్మీర బుజ్జి-శివల ఒక్కగా నొక్క కుమారుడు అశోక్ (34) రాత్రి తన ద్విచక్రవాహనంపై టేకులపల్లి నుంచి స్వగ్రామం సులానగర్ వెళ్తున్నాడు. టేకులపల్లి - సులానగర్ మార్గంలోని పెట్రోల్ బంక్  సమీపంలోని లారీ అసోసియేషన్ కార్యాలయం వద్ద కోయగూడెం ఉపరితల గని నుంచి బొగ్గు లోడుతో కొత్తగూడెం వైపు వెళ్తున్న టిప్పర్ రోడ్డుపై సగం వరకు నిలిపి ఉంచారు. అదే సమయంలో సులానగర్ వెళ్తున్న అశోక్ ఎదురుగా వస్తున్న వాహన లైటింగ్ తో  టిప్పర్ కనిపించకపోవడం వల్ల వెనకాల నుంచి లారీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అశోక్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. టేకులపల్లి ఎస్సై పోగుల సురేశ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.