గజ్వేల్(విజయక్రాంతి): గజ్వేల్ మండలం కొల్గురు గ్రామ మాజీ సర్పంచ్ మల్లం రాజు అనారోగ్యంతో ఆదివారం రాత్రి హైదరాబాదులో మృతి చెందారు. సోమవారం స్వగ్రామమైన కొల్గురుకు ఆయన మృతదేహాన్ని తీసుకువచ్చారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తదితరులు మల్లం రాజు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఓదార్చారు. కాగా టిడిపి హయాంలో మల్లం రాజు గజ్వేల్ మండల పరిషత్ అధ్యక్షునిగా కూడా సేవలందించారు. సాయంత్రానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.