15-04-2025 12:49:24 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మేజర్ పంచాయతీకి ఐదేళ్లపాటు సర్పంచిగా బాధ్యతలు నిర్వహించిన దార్ల రామ్మూర్తి పదవీకాలం ముగిసిన తర్వాత జీవనోపాధి కోసం ఉపాధి పనులకు వెళుతున్నాడు. మేజర్ పంచాయతీ అందులో మండల కేంద్రం.. ఇనుగుర్తి కి ఐదేళ్లపాటు సర్పంచ్ గా సేవలందించిన రామ్మూర్తి ఏడాదికాలంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో మళ్లీ రాజకీయంగా వెలుగు లోకి రావడానికి అవకాశాలు లేకపోవడం... సర్పంచ్ గా ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధికి చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం ఉపాధి పనులకు వెళ్తున్నట్లు చెప్పాడు.