calender_icon.png 17 March, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సఫాయి కార్మికుడికి ఆర్థిక సాయం అందించిన మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్

16-03-2025 07:34:05 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణానికి చెందిన మేజర్ గ్రామపంచాయతీ సపాయి కార్మికుడు ఎర్ర రమేష్ (32) అనారోగ్యంతో రాత్రి మరణించాడు. విషయం తెలుసుకున్న చేగుంట సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో  శ్రీనివాస్ ఎర్ర యాదగిరి, బక్క దశరథం, నాగరాజు, సాయిబాబా, పొట్టి గణేష్, దుర్గయ్య, మైసయ్య, చంద్రయ్య, బాలు, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.