సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్లు కొల నర్సయ్య ప్రభు నాయక్ ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎడ్ల సందీప్ మండల యూత్ అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ పట్టణ యూత్ అధ్యక్షులు దొనుకుల కళ్యాణ్ యూత్ నాయకులు చందనం శివరామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడకు బయల్దేరారు. రాజన్న ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ సమీపంలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 127.65 కోట్లతో పలు అభివృద్ధి పనులకు చేపడుతోంది. అనంతరం గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొనమన్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నారు. రేవంత్ రెడ్డి నేతన్నల కోసం రూ. 50 కోట్లతో నూలు బ్యాంకు ప్రారంభించనున్నారు.