14-02-2025 12:13:58 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో పుదుచ్చేరి మాజీమంత్రి కందస్వామి భేటీ అయ్యారు. పుదుచ్చెరిలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలపై చర్చించారు. చిన్నారెడ్డి గతంలో పుదుచ్చేరి కాంగ్రెస్ ఎన్నికల ఇంచార్జిగా పనిచేసిన నాటి సంగతులను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు.