calender_icon.png 27 December, 2024 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అస్వస్థత

26-12-2024 10:04:05 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. మన్మోహన్ సింగ్ కు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కాగా మన్మోహన్ సింగ్ కు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని, గతంలో ఆయన 1990 నుంచి ఐదు బైపాస్ సర్జరీలు చేయించుకున్నారు. 2004లో స్టెంటింగ్ చికిత్స కూడా జరిగింది. రెండేళ్ల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో మన్మోహన్ సింగ్ ఎయిమ్స్ లో చేరారు. ఇప్పుడు మరోసారి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.