calender_icon.png 25 December, 2024 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాజ్‌పేయీ శతజయంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

25-12-2024 09:59:51 AM

బీజేపీ ఆధ్వర్యంలో వాజ్ పేయీ శత జయంతి ఉత్సవాలు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయీ శత జయంతి ఉత్సవాలు బుధవారం నిర్వహిస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో వాజ్ పేయీ శతజయంతి ఉత్సవాలు జరపుతున్నారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్రమంత్రి అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వాజ్ పేయీకి నివాళులర్పించారు.

మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయీ శత జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రక్తదాన శిభిరాన్ని ప్రారంభించనున్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి బీజేపీ ఆఫీస్ వరకు వాజ్ పేయీ చిత్రపటంతో శోభయాత్ర చేపట్టనున్నారు. సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.