కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ముహమ్మద్ నజీర్ (78) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న నజీర్ గురువారం లాహోర్‌లోని స్వగృహంలో శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. జూనియర్ నజీర్‌గా పిలవబడే ముహమ్మద్ నజీర్ తన ఆఫ్ స్పిన్‌తో విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌ను ముప్పతిప్పలు పెట్టాడు.
పాక్ తరఫున 14 టెస్టులు, 4 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 1969లో కివీస్‌తో అరంగేట్రం టెస్టులో నజీర్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. రిటైర్మెంట్ అనంతరం అంపైర్‌గా బాధ్యతలు చేపట్టిన నజీర్ 5 టెస్టులు, 15 వన్డేల్లో అంపైరింగ్ విధులు నిర్వర్తించాడు.