calender_icon.png 25 April, 2025 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్

24-04-2025 05:05:07 PM

బాధిత కుటుంబానికి బట్టలు, దుప్పట్లు, నిత్యవసర వస్తువులు అందజేత...

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన కుమ్మరి పెద్ద నాగయ్య నివాసపూరి గుడిసె ఏప్రిల్ 13వ తారీఖున రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదవశాత్తు కాలి బూడిద అయింది. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్ని ప్రమాదం మరింత చోటు చేసుకుందనీ తెలిపారు. ఈ ఘటనలో పూరి గుడిసె పూర్తిగా కాలిపోయి తీవ్ర ఆస్తి నష్టం జరిగిన విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కుమ్మరి పెద్ద నాగయ్య కుటుంబాన్ని గురువారం పరామర్శించి, మనోధైర్యం కల్పించి దుస్తులు, దుప్పట్లు, నెలకు సరిపడా నిత్యవసర వస్తువులు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ దుద్దుల సాయిరాం, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదయ్య, మాజీ జెడ్పిటిసి సామేల్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ బోండ్ల సాయిలు, సొసైటీ డైరెక్టర్ సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ సంతోష్, పిట్ల వెంకటరాములు, సామల అరవింద్, సామల కృష్ణ, కుమ్మరి ప్రవీణ్, కురుమ సాయిలు, పిట్ల రాములు, కురుమ సయవ్వ, కురుమ గంగవ్వ, కుమ్మరి ఈశ్వరవ్వ, కుమ్మరి హరిత తదితరులున్నారు.