calender_icon.png 19 April, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితున్ని పరామర్శించిన మాజీ మున్సిపల్ చైర్మన్

15-04-2025 10:16:59 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందినటువంటి కొనగోళ్ళ సాయిబాబా పొలం వద్దకు వెళుతుంటే అడవి పంది దాడి చేసి గాయపరిచింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ బాధితుడు చికిత్స పొందుతున్న దేవి హస్పిటల్ వెళ్లి పరామర్శించారు. సాయిబాబాను పరామర్శించి దేవి హాస్పిటల్ డాక్టర్ యశ్వంత్ రామచంద్రకు తగిన వైద్యం అందించాలని కోరారు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారి పృథ్విరాజ్ తో ఫోన్ లో మాట్లాడి సాయిబాబాకి తగిన న్యాయం చేయాలని కోరారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి సామెల్, గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గురుప్రతాప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామగౌడ్, గ్రామ యువకులు పాల్గొన్నారు.