28-02-2025 02:25:04 AM
ఎల్లారెడ్డి: ఫిబ్రవరి 27( విజయక్రాంతి), కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల్ గ్రామ శివారులో గల కుచ్చపైన వెలిసిన బ్రహ్మదేవు నీ ఆలయాన్ని గురువారం ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ దర్శించుకున్నారు. బ్రహ్మదేవున్ని దర్శించుకునీ తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ తమ గ్రామ శివారులో గల కుచ్చపైన వెలసిన బ్రహ్మదేవున్నీ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జాతర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు, ఆలయం చుట్టూ భక్తిశ్రద్ధలతో ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ తో పాటు అడవి లింగాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగరాజు, గ్రామ యూత్ అధ్యక్షులు కొరంపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి సామెల్, సొసైటీ డైరెక్టర్ చెన్నంగారి సుఖేందర్ రెడ్డి, భిక్కనూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొక్కొండ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, మాజీ ఉప సర్పంచ్ జీవన్ గౌడ్, రామానంద్, జీవన్ గౌడ్, సాయిలు, నర్సింలు, బాలరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.