calender_icon.png 3 January, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరారీలో మాజీ ఎంపీటీసీ?

28-12-2024 03:22:27 AM

  • మహిళా మాజీ ప్రజాప్రతినిధి ఫిర్యాదు
  • పట్టుకునేందుకు పోలీసుల వేట

కోనరావుపేట, డిసెంబర్ 27 : ఓ మహిళా ప్రజాప్రతినిధికి అసభ్యకరంగా మెసేజ్ లు చేసిన మాజీ ఎంపీటీసీపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పరారిలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. కోనరావుపేట మండలంలోని ఓ మాజీ మహిళా ప్రజా ప్రతినిధిపై మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ దేవరకొండ నరసింహ చారి అసభ్యకరంగా  వాట్సాప్ లో మెసేజ్ లు చేశాడు.

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు మూడు రోజుల క్రితం  పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వేములవాడ ఇంచార్జీ డీఎస్పీ చంద్రశేఖర్ బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టారు.

అప్పటి నుంచి మాజీ ఎంపీటీసీ పరారీలో ఉండడం తో పాటు తనకు సహకరించిన ముగ్గురు వ్యక్తులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసు లు ఉన్నారు. కాగా మాజీ ఎంపీటీసీ చారి హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందేం దుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలు సుకున్న ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి పట్టుకునేం దుకు హైదారాబాద్ వెళ్లినట్లు సమాచారం.