29-03-2025 09:05:19 PM
చేగుంట,(విజయక్రాంతి): తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం (శ్రీ విశ్వావసు నామ సంవత్సరం) సందర్భంగా చేగుంట తాజా మాజీ ఎంపీపీ మసుల శ్రీనివాస్ మండల, పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ శుభమే జరగాలని ఆకాంక్షించారు. ఈ పండుగను ఆనందంగాను, ఉత్సాహంగా జరుపుకోవాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతోను, అష్టైశ్వర్యాలతోను తులతూగాలని అభిలాషించారు.