26-02-2025 12:04:20 AM
* తండ్రీకొడుకులను తగులబెట్టిన కేసు
* ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు
* ఇప్పటికే జీవితఖైదు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి గా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు ఢిల్లీలోని రౌస్ అవె న్యూ కోర్టు సోమవారం మరోసారి జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. తండ్రీ కొడుకులను సజీవదహనం చేసిన కేసులో సజ్జన్‌కు జీవితఖైదు విధిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా తెలిపారు.
ఇప్పటికే సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమా ర్ జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. సిక్కు వ్యతిరేక అల్లర్ల సందర్భంగా ఢిల్లీలోని సరస్వతి నగర్‌లో జశ్వంత్ సింగ్ ఇంటిపై మూ కుమ్మడి దాడికి పాల్పడ్డారు. జశ్వంత్ సింగ్, అతడి కుమారుడు తరుణ్‌దీప్ సింగ్‌లను వారి ఇంట్లోనే తగులబెట్టి సజీవదహనం చేశారు.
ప్రమాద సమయంలో ప్రాణాలతో బయటపడిన జశ్వంత్ సింగ్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిబ్రవరి 12వ తేదీనే సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చిన రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా శిక్షను విధించింది.