calender_icon.png 16 March, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైరాలో ఘనంగా మాజీ ఎంపీ నామ జన్మదిన వేడుకలు..

15-03-2025 09:13:57 PM

'నామా' నిండు నూరేళ్లు బాగుండాలి..

వైరా (విజయక్రాంతి): భారత రాష్ట్ర సమితి వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం వైరాలో ఘనంగా నిర్వహించారు. వైరాలో క్రాస్ రోడ్డు సమీపంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కేక్ కట్ చేసి ఒకరికొకరు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు.. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. కేసిఆర్ నాయకత్వం వర్ధిల్లాలని, జై నామ జై జై నామ అంటూ హోరెత్తిన నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నామా నాగేశ్వరరావు మంచి సేవా తత్పరుడని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన మహానుభావుడని ఆయన నిండు నూరేళ్లు జీవితాంతం సంతోషంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దెల రవి జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్, నాయకులు కామినేని శ్రీనివాసరావు, మాదినేని ప్రసాద్ దొంతిపోయిన వెంకటేశ్వర్లు ఏదునూరి శ్రీను గుజ్జర్లపూడి దేవరాజ్, షేక్ సైదా అప్పం సురేష్, కారుకొండ బోసు వల్లెపు రాము బత్తుల వెంకటేశ్వర్లు దరిపల్లి శ్రీనివాసరావు, సంసోను ఆదూరి ప్రేమ్ కుమార్, బాబు, అయినాల కనకరత్నం, అదూరి బాబు, సింగవరపు నరేష్, వీరబాబు యాదవ్, పాముల వెంకటేశ్వర్లు, నందిగామ మనోహర్ వాసు బట్టా బద్రయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.