calender_icon.png 19 April, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎంపీ మధుయాష్కీ మాతృమూర్తి వర్ధంతి

16-04-2025 12:22:56 AM

హాజరైన వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు 

ఎల్బీనగర్, ఏప్రిల్ 15 : టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ మాతృమూర్తి అనసూయ  ప్రథమ వర్ధంతి కార్యక్రమం మంగళవారం హయత్ నగర్ లోని టీ నగర్ కాలనీలోని  నివాసంలో నిర్వహించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, మహిళా నాయకురాళ్లు, నాయకులు కార్యకర్తలు హాజరై అనసూయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.