calender_icon.png 12 March, 2025 | 3:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నమ్మడం లేదు: బూర నర్సయ్య

11-03-2025 01:04:21 PM

కాంగ్రెస్ విధ్వంసక రాజకీయాలు

కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి నమ్మడం లేదు

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి ఇచ్చిన పేర్లను పక్కన పెట్టారు

హైదరాబాద్: బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్(Ex MP Boora Narsaiah Goud) మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక( Telangana MLC Candidates List)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఇచ్చిన పేర్లను పక్కన పెట్టారని బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ విధ్వంసక రాజకీయాలు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 40 సార్లు ఢిల్లీ వెళ్లారు. 10 రోజులకు ఒకసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ(Revanth Reddy Delhi Tour) వెళ్తున్నారని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నమ్మడం లేదు, కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి నమ్మడం లేదని ఆయన జోస్యం చెప్పారు.