calender_icon.png 16 January, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ కార్పోరేటర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ బోయినపల్లి

16-01-2025 05:48:22 PM

లంక రవీంధర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ యాదగిరి సునీల్ రావు. 

వారి కుటుంబ సభ్యులను పరామర్శించి... సానుభూతి వ్యక్తం చేసిన వినోద్ కుమార్... 

కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ లోని వావిలాలపల్లిలో ఇటీవల గుండె పోటుతో మరణించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పోరేటర్ లంక రవీంధర్ మృతి పట్ల కరీంనగర్ మాజీ ఎంపీ, మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గురువారం రోజు లంక రవీంధర్ నివాసంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పోరేటర్ వాల రమణ రావుతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి... సానుభూతి వ్యక్తం చేశారు. వారి కుటుంబంతో కాసేపు మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లంక రవీంధర్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎంపీ హామీ ఇచ్చారు.