15-03-2025 09:21:35 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు కొత్తగూడెం మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి స్వగృహం నందు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మొక్కలు నాటడం జరిగింది. ముఖ్యఅతిథిగా టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ పాల్గొని మాట్లాడుతూ... ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించిన నాయకులు నామ నాగేశ్వరరావు అని అన్నారు.
అసెంబ్లీలో సింగరేణి కార్మికులకు ఇన్‌కంటాక్స్ రద్దు జేయాలని, పార్లమెంటులో బిఆర్ఎస్ పార్టీ సభా పక్ష నేతగా, శ్రీమతి కల్వకుంట్ల కవితతో పాటు తన గొంతు కనుగట్టిగ వినిపించిన మహా నాయకుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, ఈశ్వరి, సుమ, రాణమ్మ, ఉపేంద్ర, లక్ష్మి, చంద్రకళ, సరిత, పుల్లమ్మ, సత్యావతి, శివ, సత్తి, రోషన్, మధు, రాజు, షణ్ముఖ, కార్తిక్, వినీత్, పూర్ణ ప్రసాద్, కన్ని తదితరులు పాల్గొన్నారు.