calender_icon.png 3 February, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నుమూత

27-01-2025 12:00:00 AM

సంగారెడ్డి, జనవరి 26 (విజయ క్రాంతి) : మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ ఆరోగ్యంతో మృతి చెందారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందారు.తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ సత్యనారా యణ పార్థివ దేహానికి  మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో పాటు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు నివాళులు అర్పించారు.

శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులను, బంధువులను మాజీ మంత్రి హరీష్ రావు ఓదార్చారు.జర్నలిస్టుగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా, తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా సత్యనారాయణ తన దైన ముద్ర వేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో వారి కృషి, బీఆర్‌ఎస్ పార్టీకి వారి సేవలు చిరస్మరణీయమని సత్తన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అని తెలిపారు.

సత్యనారాయణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ మృతి పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సత్యనారాయణ చేసిన కృషిని, వారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.

సీనియర్ జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా ఆయన అందించిన సేవలు, బీఆర్‌ఎస్ పార్టీ కోసం చేసిన కృషి గొప్పవన్నారు. సత్యనారాయణ మృతితో తెలంగాణ ఒక నిఖార్సైన ఉద్యమకారుడిని కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు కేసీఆర్  ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సత్యనారాయణ సేవలు చిరస్మరణీయం: మంత్రి దామోదర రాజనర్సింహ 

ఆందోల్ జనవరి 26 : మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ మృతిపట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌గా, ఎమ్మెల్సీగా సత్యనారాయణ చేసిన సేవలు చిరస్మరణీయం అని మంత్రి కొనియాడారు. తెలంగాణ సాధన కోసం సత్యనారాయణ తాపత్రాయ పడేవారు అని, ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారని మంత్రి గుర్తు చేసుకున్నారు.

సత్యనారాయణ మృతి బాధాకరం అని పేర్కొన్నారు. సత్యనారాయణ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులకు మంత్రి సానుభూతి ప్రకటించారు.

సత్యనారాయణ వల్లె రాజకీయాలకు వచ్చా: మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

తనను రాజకీయంలోకి తీసుకువచ్చింది సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ అని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గుర్తు చేసుకున్నారు. ఆదివారం నాడు జోగిపేట బిఆర్‌ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మృతిపై సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మృతి తెలంగాణ సమాజానికితీరని నష్టం అన్నారు. జర్నలిస్ట్ గా జిల్లాలో వార్త కథనాలు రాసి ప్రజలను సత్యనారాయణ చైతన్య పరిచారన్నారు. సింగూరు మంజీరా జలాలు జిల్లాకు దక్కాలని వెలుగెత్తి చాటిన మొట్టమొదటి వ్యక్తి, ప్రజలతో కమిట్మెంట్ ఉన్న వ్యక్తి మరణించడం చాలా బాధాకరం అన్నారు. తెలంగాణ కోసం తన పదవిని తున ప్రాయంగా వదిలేసిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.