సంగారెడ్డి, (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.సత్యనారాయణ(Former MLC Satyanarayana passed away) అనారోగ్యంతో మృతి చెందారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర సాధన కోసం కృషి చేశారు. మంజీరా నదిపై కర్ణాటక ప్రభుత్వం చెక్ చెక్ డ్యాములు నిర్మాణం చేసి నీటితో పొడి చేస్తున్న విధానాన్ని పుస్తకాన్ని రాసి ప్రచురించారు. మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ మృతి పై పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.