calender_icon.png 27 December, 2024 | 8:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి కన్నుమూత

28-10-2024 12:40:44 AM

సంతాపం ప్రకటించిన పీసీసీ చీఫ్, మండలి చైర్మన్, స్పీకర్ 

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఇంద్రసేనారెడ్డికి ఇందిరాగాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఇంద్రసేనారెడ్డి మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్,  పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు.

ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  ఇంద్రసేనారెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు.  తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారని తెలిపారు.

మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనారెడ్డి ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఎంతో సేవ చేశారనిమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంచి మిత్రుడిని కోల్పోయానని వీహెచ్ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచి ఇంద్రసేన్‌రెడ్డి  కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు.