calender_icon.png 29 March, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాడువాయిలో మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

26-03-2025 01:29:58 AM

తాడ్వాయి, మార్చి, 25( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎర్ర పహాడ్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ  మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు ఆయన నిండు నూరేళ్లు జీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కపిల్ రెడ్డి, నర్సింలు, రాజు గౌడ్, వెంకట్ రెడ్డి,బాల్ రెడ్డి మంగారెడ్డి, రంగారావు  తదితరులు పాల్గొన్నారు