24-03-2025 06:28:04 PM
గంప గోవర్ధన్...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని అంబారిపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిరికొండ శంకర్ తండ్రి ఆదివారం స్వర్గస్తులైనందున సోమవారం కామారెడ్డి మాజీ శాసనసభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అంబారిపేట గ్రామంలోని శంకర్ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట గ్రామ మాజీ సర్పంచ్ సలీం, PACS వైస్ ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్, SC సెల్ మండల అధ్యక్షులు రాజేందర్, దోమకొండ మండల యూత్ అధ్యక్షులు పాలకుర్తి శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి బొమ్మెర శ్రీనివాస్, దోమకొండ పట్టణ అధ్యక్షులు బోరెడ్డి కిషన్ రెడ్ది, నాయకులు కానుగంటి నాగరాజు, రవి తదితరులు ఉన్నారు.