07-04-2025 12:49:48 AM
అందోల్ ఏప్రిల్ 6 : సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు షాపులు కోల్పోతున్న బాధితులను ఆదివారం మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పరామర్శించారు. రోడ్డు విస్తరణ పేరుతో గత 60 ఏళ్లుగా రోడ్డు పక్కన జీవనోపాధి పొందుతున్న వారి జీవితాలు రోడ్డున పడ్డాయని బాధితులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. న్యాయం కావాలంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వద్దకు వెళ్లిన మాకు అవమానం ఎదురైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే బాధితులకు నష్ట పరిహారం అందించాలని న్యాయం జరిగే వరకు బాధితులకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అయన విలేకరులతో మాట్లాడుతూ ఆకస్మాత్తుగా నోటీసులిచ్చి ప్రభుత్వం నుండి ఎలాంటి భద్రత భరోసా లేకుండా కూల్చివేతలు ప్రారంభించడం ఎంత వరకు సమంజ సమని క్రాంతి కిరణ్ ప్రశ్నించారు.మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యెక చొరవ తీసుకొని నష్టపరిహారం కింద ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలనీ మాజీ ఎమ్మెల్యే కోరారు.