02-04-2025 07:32:31 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): ఇటీవల అనారోగ్యంతో మరణించిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు బోయిన కొమురయ్య కుటుంబ సభ్యులను బుధవారం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు. మంచిర్యాలలో నిర్వహించిన బోయిన కొమురయ్య దశదిన కర్మకు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ బెల్లంపల్లి టౌన్ యూత్ ప్రెసిడెంట్ సబ్బని అరుణ్, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు మురారితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.