calender_icon.png 21 April, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే షకీల్

11-04-2025 12:14:46 AM

  1. తల్లి మృతితో హైదరాబాద్ వచ్చిన బోధన్ మాజీ ఎమ్మెల్యే
  2. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో  షకీల్ అరెస్ట్..
  3. తల్లి అంత్యక్రియలు, తదుపరి కార్యక్రమాలు పూర్తయ్యేవరకు కండీషనల్ బెయిల్
  4. సాక్ష్యాలను మార్చి కొడుకును కాపాడే వ్యవహారంలో ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు

కామారెడ్డి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి)/ రాజేంద్రనగర్: బీఆర్‌ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌ను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేసి తన కొడుకు సాహిల్‌ను రక్షించేందుకు షకీల్ ప్రయత్నించారనే అభియోగాలుండగా, అతడిపై లుకౌట్ నోటీసులు జారీఅయ్యాయి.

దీంతో షకీల్ కొన్ని నెలలుగా ఇండియాకు రాకుండా దుబాయ్‌లోనే ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న షకీల్ తల్లి షగుఫ్తా అదీద్ (80) మృతిచెందడంతో ఆయన గురువారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు. షకీల్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు.

న్యాయవాదులు టాస్క్‌ఫోర్స్ పోలీసులు పెట్టిన నిబంధనలకు ఒప్పుకోవడంతో షకీల్‌కు ఆయన తల్లి అంత్యక్రియలతో పాటు తదిపరి కార్యక్రమాలు పూర్తయ్యేవరకు కండీషన్ బెయిల్ ఇచ్చారు. అతడిపై పోలీసుల నిఘా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. 

బోధన్‌లో షకీల్ తల్లి అంతక్రియలు 

నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మె ల్యే షకీల్ ఆమెర్ తల్లి షగుఫ్తా అదీద్ (80) అంతక్రియలు గురువారం బోధన్‌లో జరిగా యి. అదీద్ పార్థీవదేహాన్ని హైదరాబాద్ నుంచి బోధన్‌లోని షకీల్ స్వగృహానికి ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చారు. తల్లి మృతదేహంతో పా టు షకీల్ కూడా వచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు అంతక్రియలు పూర్తిచేశారు.