calender_icon.png 25 April, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు కోర్టులో ఊరట

25-04-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24(విజయక్రాంతి) : బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు నాంపల్లి కోర్టు లో ఊరట లభించినట్లు తెలుస్తోంది. కాగా బుధవారం పంజాగుట్ట పోలీసు లు షకీల్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం షకీల్‌ను నాంపల్లి కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చడంతో రిమాండ్‌కు తిరస్కరించిన న్యాయమూర్తి షకీల్‌కు బెయిల్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో షకీల్‌కు ఊరట కలిగింది.

కాగా 2023 డిసెంబర్‌లో ప్రగతి భవన్ వద్ద గల భారికేడ్లను ఢీకొన్న కేసులో షకీల్ కుమారుడు రాహిల్ సహా షకీల్, పలువురిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. భారికేడ్లను కారు తో ఢీకొన్న అనంతరం షకీల్ కుమారుడు రాహిల్ అతని స్థానంలో మరో వ్యక్తిని చూపి పరారయ్యాడు. అతనికి షకీల్ సహకరించాడనే అభియోగం ఉంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దరు సీఐలు సహా 16మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.