04-04-2025 01:28:42 AM
హుజూర్‌నగర్, ఏప్రిల్ 3: హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మండలం మేడారం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి,జీవద్వజ, ముత్యాలమ్మ ప్రతిష్ట,ఆంజనేయ స్వామి వారి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ రాష్ట నాయకులు శానంపూడి సైదిరెడ్డి.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు సైదిరెడ్డి ని ఘనంగా సత్కరించారు. సైదిరెడ్డి హయంలో గుడి నిర్మాణానికి సి.జీ.ఎఫ్ గ్రాంట్ నుండి రూ. 40.00 లక్షల నిధులు మంజూరు చేయడం వల్లనే గుడి నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, గ్రామ ప్రజల తరుపున అయనకు కృతజ్ఞతలు తెలిపారు.