09-04-2025 08:31:24 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పినపాక మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని గల ప్రభుత్వం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నందు కేక్ కటింగ్ చేసి కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ.. భద్రాద్రి సీతారాములా వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అష్టైశ్వర్యాలుకలగా చేయాలని భవిష్యత్తులో ఉన్నత పదవులు అవరోధించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొనకంచి శ్రీను,గోనెల నాని, సానికొమ్ము శంకర్ రెడ్డి, బొల్లు సాంబ, రవికుమార్, కనకాచారి, పూర్ణ, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.