06-03-2025 10:16:26 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలపై గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటమిపై చర్చించారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు ముఖ్య నాయకులు రవీందర్ రెడ్డికి వివరించారు. బిజెపి అభ్యర్థి గెలుపు కోసం హోటల్ కు డబ్బులు ఇచ్చి మభ్య పెట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని సంకల్పంతో పనిచేశారని బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు.