14-04-2025 01:15:46 AM
మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే కోవలక్ష్మి కుటుంబ సభ్యులు
ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 13(విజయక్రాంతి): రెబ్బెన మండలం ఇందిరా నగర్ గ్రామంలో స్వయంభు వెలసిన మహంకాళి జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే కోవా లక్ష్మి కుటుంబ సభ్యు లతో కలసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, మేకతో మొక్కులు చెల్లించారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
ఆలయ అర్చకుడు దేవర వినోద్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అమ్మవారికి బోనాలు, వస్త్రాలు, బియ్యం, తీపి వంట పదార్థాలు, పాన్ సమర్పించారు.మేకలు, కోళ్లు కోసి మొక్కులు చెల్లించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది. జాతర జనసంద్రంతో కిటకిటలాడింది. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.