calender_icon.png 28 February, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చి మత గురువు రాబిన్సన్‌కు మాజీ ఎమ్మెల్యే నివాళి

28-02-2025 12:22:14 AM

మెదక్, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): మెదక్ సిఎస్‌ఐ చర్చ్ రిటైర్డ్ గురువు రాబిన్ సన్ బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న మెదక్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గురువారం రోజు మెదక్ పట్టణంలోని దాయర వీధిలో రాబిన్సన్ నివాసానికి వెళ్ళి నివాళులర్పించారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె వెంట రాష్ట్ర నాయకులు ఎం.దేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, తాజా మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు వంజరి జయరాజు, ఆర్కే శ్రీనివాస్, చంద్రశేఖర్ గౌడ్, నాయకులు బండ నరేందర్, కసాపురం కిరణ్, ఎం.బి పూర్  మహేష్ ఉన్నారు.